Skip to main content

ఫిషర్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

మత్స్యకారులు బయలుదేరిన ప్రాంతం నుంచి ఏ వైపు వెళితే చేపలు దొరుకుతాయో సూచించేందుకు ఉద్దేశించిన ఫిషర్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ అప్లికేషన్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎంఏ)ను డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ తయారు చేసింది.
Current Affairs క్వాల్‌కం సంస్థ ఆర్థిక సహకారం, ఇన్‌కాయిస్‌ సంస్థ సాంకేతిక సహకారంతో ఈ యాప్‌ రూపుదిద్దుకుంది. ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, ఒడియా, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఉంటుంది.

యాప్‌ విశేషాలు...
  • సముద్రంలో వేటకు వెళ్లవచ్చో లేదో తెలియజేసే సమాచారాన్నీ ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఈ యాప్‌లో ఉండే జీపీఎస్‌ ఆప్షన్‌ ద్వారా మత్స్యకారులున్న ప్రాంతానికి ఎంత దూరంలో చేపలున్నాయో తెలుసుకోవచ్చు.
  • ఏ ప్రాంతం, ఏయే రకం చేపలు ఎంత లోతులో దొరుకుతాయో సూచించడంతోపాటు అక్షాంశ, రేఖాంశాల వారీ సమాచారాన్ని తెలియజేస్తుంది.
  • సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులు తమ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యల్ని వివరిస్తుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఫిషర్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ అప్లికేషన్‌(ఎఫ్‌ఎఫ్‌ఎంఏ)ను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : జూన్‌ 13
ఎవరు : డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌
ఎందుకు : మత్స్యకారుల కోసం...
Published date : 15 Jun 2021 08:06PM

Photo Stories