ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్ లో భారత్ స్థానం?
Sakshi Education
ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్(ఫిఫా-ఎఫ్‌ఐఎఫ్‌ఏ) 2020, సెప్టెంబర్ 17న ప్రకటించిన ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్ లో భారత్‌కు 109వ స్థానం దక్కింది.
ఈ ర్యాంకింగ్స్ లో బెల్జియం జట్టు... 1773 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. 2018 సాకర్ ప్రపంచ కప్ విజేత ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉండగా... మూడు, నాలుగు స్థానాల్లో బ్రెజిల్, ఇంగ్లండ్ జట్లు వరుసగా ఉన్నాయి. 2016 యూరో కప్ చాంపియన్ పోర్చుగల్ రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు భారత్ ర్యాంకింగ్‌సలో ఒక స్థానం దిగజారి 109వ స్థానంలో నిలిచింది. ఆసియా నుంచి జపాన్ (28వ ర్యాంకు) తొలి స్థానంలో ఉంది. ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్ లో భారత్‌కు 109వ స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్(ఫిఫా-ఎఫ్‌ఐఎఫ్‌ఏ)
ఎక్కడ : ప్రపంచంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్ లో భారత్‌కు 109వ స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్(ఫిఫా-ఎఫ్‌ఐఎఫ్‌ఏ)
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 18 Sep 2020 05:25PM