ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌గా నియమిలైన దర్శకుడు?
Sakshi Education
పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) సొసైటీ ప్రెసిడెంట్‌గా, ఎఫ్‌టీఐఐ ఇనిస్టిట్యూట్స్ గవర్నర్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ నియమితులయ్యారు.
ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ, భారీ పరిశ్రమల శాఖల మంత్రి ప్రకాశ్ కేశవ్ జవదేకర్ సెప్టెంబర్ 30న తెలిపారు. 2023, మార్చి 3 వరకు శేఖర్ కపూర్ పదవీకాలం కొసాగుతుందని పేర్కొన్నారు.
1983లో మాసూమ్ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా శేఖర్ కపూర్ బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత మిస్టర్ ఇండియా (1987), బండిట్ క్వీన్ (1994), ఎలిజబెత్ (1998), ది ఫోర్ ఫీదర్స్ (2002), ఎలిజబెత్: ది గొల్డెన్ ఏజ్ (2007), న్యూయార్క్, ఐ లవ్ యూ (2008), పాసేజ్ (2009) చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఇష్క్ ఇష్క్ ఇష్క్, ఉడాన్, విశ్వరూపం, విశ్వరూపం 2 చిత్రాల్లో నటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) సొసైటీ ప్రెసిడెంట్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్

Published date : 01 Oct 2020 05:20PM