ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్ భేటీ
Sakshi Education
2019, ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కానున్నట్లు వైట్‌హౌస్ జనవరి 19న ప్రకటించింది.
అయితే ఈ సమావేశం జరిగే వేదికను త్వరలోనే వెల్లడించనున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఈ భేటీ సందర్భంగా ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. 2018, జూన్ 12న సింగపూర్‌లో ట్రంప్, కిమ్ తొలిసారి భేటీ అయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు, ఉత్తరకొరియా అధినేత భేటీ
ఎప్పుడు : 2019, ఫిబ్రవరి
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు, ఉత్తరకొరియా అధినేత భేటీ
ఎప్పుడు : 2019, ఫిబ్రవరి
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్
Published date : 21 Jan 2019 06:12PM