Skip to main content

ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్‌ల జాబితాలో ప్రత్యూష

ప్రపంచంలోనే ‘ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ టాప్-500’ జాబితా విడుదలైంది.
Current Affairsరెండేళ్లకోసారి విడుదలయ్యే ఈ జాబితాలో తాజాగా భారత్ నుంచి రెండు సూపర్ కంప్యూటర్‌లు చోటు దక్కించుకున్నాయి. జాబితాలో ప్రత్యూష సూపర్ కంప్యూటర్ 57వ స్థానంలో, మిహిర్ సూపర్ కంప్యూటర్ 100వ స్థానంలో నిలిచాయి. పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీలో ప్రత్యూష కంప్యూటర్‌ను, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ సంస్థలో మిహిర్ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి రెండూ క్రే ఎక్స్‌కసీ 40 సిస్టం ఆధారంగా పనిచేస్తాయి.

ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ టాప్-500 జాబితాలో ఎక్కవ భాగం అమెరికా, చైనా కంప్యూటర్లే ఉన్నాయి. జాబితాలో అమెరికాలోని ఓక్ రిట్జ్ నేషనల్ ల్యాబొరేటరీలోని సమిట్, లారెన్స్ లివర్ మోర్ నేషనల్ ల్యాబ్‌లోని సియోర్రా సూపర్ కంప్యూటర్లు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీటిని ఐబీఎం తయారుచేసింది. ఇక మూడో స్థానాన్ని చైనాలోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్లో ఉన్న ‘సన్ వే తైహూలైట్’దక్కించుకుంది.
Published date : 23 Nov 2019 05:51PM

Photo Stories