Skip to main content

ఫార్చూన్ 40:40 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు?

ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ చోటు దక్కించుకున్నారు.
Current Affairs

అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్‌లకు కూడా స్థానం లభించింది. 40 ఏళ్ల లోపు వయస్సున్న 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది.

టెక్నాలజీ కేటగిరీలో...
2020 ఏడాది ఆర్థికం, సాంకేతికత, వైద్యం, ప్రభుత్వం.. రాజకీయాలు, మీడియా.. వినోదరంగం అనే అయిదు కేటగిరీల నుంచి ఫార్చూన్ ప్రముఖులను ఎంపిక చేసింది. టెక్నాలజీ కేటగిరీలో ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ చోటు దక్కించుకున్నారు.

రిలయన్స్ కు తోడ్పాటు...
{బౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ పొందిన తర్వాత 2014లో ఆకాశ్ కుటుంబ వ్యాపారమైన రిలయన్స్ లో చేరారు. యేల్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఈషా ఆ మరుసటి ఏడాది కంపెనీలో చేరారు. రిలయన్స్ లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్ చేయడంలో జియో బోర్డు సభ్యులుగా వీరు తోడ్పాటు అందించినట్లు ఫార్చూన్ పేర్కొంది.

ఆన్‌లైన్ విద్య సాధ్యమేనని...
భారీ స్థాయిలో ఆన్‌లైన్ విద్యా సంస్థను నెలకొల్పడం సాధ్యమేనని రవీంద్రన్ నిరూపించారని ఫార్చూన్ పేర్కొంది. అటు స్టార్టప్స్ ఏర్పాటు చేసిన అనుభవం తప్ప స్మార్ట్‌ఫోన్స్ గురించి అంతగా తెలియని మను జైన్ .. చైనా కంపెనీ షావోమీ భారత్‌లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు తోడ్పడ్డారని తెలిపింది.

చదవండి: పపంచంలోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా పేరొందిన భారతీయుడు?

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్చూన్ 40అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ బెజు రవీంద్రన్, మను కుమార్ జైన్

Published date : 03 Sep 2020 04:55PM

Photo Stories