Skip to main content

ఫాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ సవరణ బిల్లు ఉద్దేశం?

సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) బిల్లు-2021కు పార్లమెంటు జూలై 29న ఆమోదముద్ర వేసింది.
జూలై 26న బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించగా, తాజాగా రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంఎస్‌ఎంఈ రంగానికి వర్కింగ్‌ క్యాపిటల్‌ లభ్యత కొంత సులభతరం అవుతుంది.

ప్రభుత్వం రంగ సంస్థలుసహా తమకు బకాయిలు చెల్లించాల్సిన కంపెనీల నుంచి ఎంఎస్‌ఎంఈలు త్వరిత గతిన వసూళ్లును చేయగలుగుతాయి. తమకు రావాల్సిన మొత్తాలను మూడవ పార్టీకి విక్రయించి తక్షణ నిధులు పొందడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. 2020 సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన ఈ బిల్లులో యూకే సిన్హా కమిటీ చేసిన పలు సిఫారసులను చేర్చారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూలై 29
ఎవరు : భారత పార్లమెంటు
ఎందుకు : సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి....
Published date : 02 Aug 2021 06:27PM

Photo Stories