పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీగా కె. శ్రీకాంత్
Sakshi Education
ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా కె. శ్రీకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ విషయాన్ని సంస్థ ఆగస్టు 21న ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కంపెనీ ఫైనాన్స్ విభాగ డెరైక్టర్ హోదాలో పనిచేసిన శ్రీకాంత్‌కు విద్యుత్ రంగంలో 33 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని తెలిపింది. క్యాపిటల్ బడ్జెటింగ్ రూపకల్పన, దీర్ఘకాలిక ఫైనాన్స్ ప్లానింగ్, వనరుల సమీకరణ వంటి అంశాల్లో మంచి పట్టు సాధించారని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కె. శ్రీకాంత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కె. శ్రీకాంత్
Published date : 22 Aug 2019 05:41PM