Skip to main content

పూసా కృషి విజ్ఞాన్ మేళా 2020 ముగింపు

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మార్చి 1న మొదలైన ‘పూసా కృషి విజ్ఞాన్ మేళా 2020’ మార్చి 3న ముగిసింది.
Current Affairsముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరానికి చెందిన ఆదర్శరైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) ‘సృజనాత్మక రైతు’ అవార్డును మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. వినూత్న పద్దతుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఆకేపాటికి ఈ జాతీయ పురస్కారం లభించడం ఇది రెండవసారి. దేశవ్యాప్తంగా మొత్తం 47 మంది రైతులు ఐఏఆర్‌ఐ జాతీయస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు.
Published date : 04 Mar 2020 05:55PM

Photo Stories