Skip to main content

పూర్తి మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను ప్రారంభించిన దేశం?

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Current Affairs పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టింది. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)కు చెందిన ‘‘ఎమ్‌టీ స్వర్ణకృష్ణ’’ అనే భారీ నౌక ఇందుకు వేదికైంది. మార్చి 8న కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ జెండా ఊపి ఈ చరిత్రాత్మక యాత్రను ప్రారంభించారు. ముంబైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టులోని లిక్విడ్‌ బెర్త్‌ జెట్టీ నుంచి స్వర్ణకృష్ణ బయలుదేరింది. ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి.

ఎమ్‌టీ స్వర్ణకృష్ణ: పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్‌ నౌక. 2010లో దీన్ని నిర్మించారు. గరిష్ఠంగా 10.5 నాట్‌ (గంటకు దాదాపు 20 కిలోమీటర్లు)ల వేగంతో ప్రయాణిస్తుంది. 73 వేల టన్నుల బరువును ఇది మోసుకెళ్లగలదు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : పూర్తి మహిళా సిబ్బందితో కూడిన ప్రపంచ నౌకా యాత్రను ప్రారంభించిన దేశం?
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : భారత్‌
ఎక్కడ‌ : జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టు, ముంబై, మ‌హ‌రాష్ట్ర
ఎందుకు : షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని
Published date : 12 Mar 2021 09:32AM

Photo Stories