పూరీ సమీపంలో తీరం దాటిన ఫొని
Sakshi Education
ఒడిశాలోని పూరీ సమీపంలో మే 3న ఫొని తుపాను తీరం దాటింది. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ఫొని తీరం దాటే సమయంలో గంటకు 175-205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.

ఈ తుపాను కారణంగా ఎనిమిది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతితీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ మే 4 నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది.
పెనుగాలులు.. కుండపోత వర్షాలు..
ఫొని తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసం కాగా వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముందస్తు చర్యగా 11 లక్షల మంది బాధితులను ఒడిశా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఫొని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. ఫొని తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక కార్యక్రమాల కోసం ముందస్తుగా రూ. 1,000 కోట్లు విడుదల చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఫొని తుపాను పేరును బంగ్లాదేశ్ సూచించగా, ఫొని అనే పదానికి పాము పడగ అని అర్థం వస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తీరం దాటిన ఫొని తుపాను
ఎప్పుడు : మే 3
ఎక్కడ : పూరీ సమీపం, ఒడిశా

Published date : 04 May 2019 05:47PM