Skip to main content

పులిట్జర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు?

భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌... అమెరికాలో జర్నలిజానికి ఇచ్చే అత్యున్నత స్థాయి పురస్కారం ‘‘పులిట్జర్‌ ప్రైజ్‌’’ను గెలుచుకున్నారు.
Current Affairs 2021 ఏడాదికిగాను ఆమెకు ఈ అవార్డు లభించింది. చైనాలోని జిన్‌జియాంగ్‌లో వేలాదిమంది ముస్లింలను నిర్బంధించడానికి ప్రభుత్వం రహస్యంగా కట్టిన జైళ్లు, శిబిరాలకు సంబంధించిన పరిశోధనాత్మక కథనాలను రాసినందుకు ఇద్దరు కంట్రిబ్యూటర్లతో కలిసి ఆమెకు ఈ ప్రైజ్‌ దక్కింది.

శాటిలైట్‌ ఇమేజ్‌లతో సహా...
2017లో చైనా అత్యంత కర్కశంగా వ్యవహరించి వేలాది మంది ముస్లిం మైనారిటీలను జైళ్లలో బంధించింది. ఈ విషయాన్ని శాటిలైట్‌ ఇమేజ్‌లతో సహా బయట ప్రపంచానికి మేఘ తన కథనాల ద్వారా తెలియజేశారు. అలిసన్‌ కిలింగ్, క్రిస్టో బస్‌చెక్‌లతో కలిసి ఆమె ఈ పరిశోధనాత్మక కథనాలను రాశారు. మేఘ ప్రస్తుతం బజ్‌ఫీడ్‌ న్యూస్‌లో పని చేస్తున్నారు.

‘ఫ్లాయిడ్‌’ టీనేజర్‌కు ప్రశంస
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌పై పోలీసుల దాష్టీకాన్ని ప్రపంచానికి చూపిన టీనేజర్‌ డార్నెల్లా ఫ్రేజియర్‌ను పులిట్జర్‌ ప్రత్యేకంగా ప్రశంసించింది. ‘2020 మే 25న ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్‌ చౌవిన్‌ అతని మెడపై మోకాలు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసిన విషయం తెలిసిందే. దీన్ని అటుగా వెళ్తున్న 17 ఏళ్ల ఫ్రేజియర్‌ వీడియో తీసింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : పులిట్జర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు?
ఎప్పుడు : జూన్‌ 12
ఎవరు : మేఘ రాజగోపాలన్‌
ఎక్కడ : అమెరికా
ఎందుకు : చైనాలోని జిన్‌జియాంగ్‌లో వేలాదిమంది ముస్లింలను నిర్బంధించడానికి ప్రభుత్వం రహస్యంగా కట్టిన జైళ్లు, శిబిరాలకు సంబంధించిన పరిశోధనాత్మక కథనాలను రాసినందుకు...
Published date : 15 Jun 2021 08:11PM

Photo Stories