Skip to main content

పసిడి కళాకృతులకు హాల్‌మార్క్ : కేంద్రం

దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ నవంబర్ 29న ప్రకటించారు.
Current Affairsఇందుకు సంబంధించి 2020, జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. నగల వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని, హాల్‌మార్క్‌తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

2000 ఏప్రిల్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను ధ్రువీకరించే పథకాన్ని బీఐఎస్ ఆచరణలోకి తీసుకొచ్చింది. కాకపోతే తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్‌మార్క్‌వి ఉంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 234 జిల్లాల పరిధిలో 877 హాల్‌మార్కింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2021 జనవరి 15 నుంచి పసిడి కళాకృతులకు హాల్‌మార్క్ తప్పనిసరి
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్
ఎందుకు : వినియోగదారుల ప్రయోజనాల కోసం
Published date : 30 Nov 2019 05:43PM

Photo Stories