Skip to main content

పర్యావరణ పరిరక్షణ బ్యాక్టీరియా గుర్తింపు

నేల కాలుష్యాన్ని నివారించే సరికొత్త బ్యాక్టీరియాను అమెరికాలోని కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Current Affairs‘పారాబర్హోల్డేరియా మాడ్సేనియానా’ అని నామకరణం చేసిన ఈ సరికొత్త బ్యాక్టీరియా వాతావరణంలోని హానికారక ఉద్గారాలను తగ్గించగలుగుతుంది. కాలుష్యభరిత నేలల్లో పెరిగే చెట్లు, మొక్కల నుంచి కార్బన్‌ను పీల్చుకొని.. దానికి బదులుగా వాటికి నైట్రోజన్, ఫాస్పరస్ వంటి పోషకాలను ఈ బ్యాక్టీరియా అందిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సిస్టమేటిక్ అండ్ మైక్రోబయాలజీలో ప్రచురితమయ్యాయి.

పీఏహెచ్ రసాయనాలు...
బొగ్గు, గ్యాస్, చమురు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యకాసారాలుగా మారిన నేలల్లోకి పాలీ క్లినిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్(పీఏహెచ్) రసాయనాలు ఇంకుతుంటాయి. వాటి ప్రభావంతో పరిసర ప్రాంత ప్రజలకు కేన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదకర పీఏహెచ్‌లను మాడ్సేనియానా నిర్వీర్యం చేసి, వాటి స్థానంలో నేలలోకి పోషకాలను భర్తీ చేస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నేల కాలుష్యాన్ని నివారించే బ్యాక్టీరియా గుర్తింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : అమెరికాలోని కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు
Published date : 22 Feb 2020 05:49PM

Photo Stories