ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ
Sakshi Education
గాంధీ కుటుంబం నుంచి మరో వారసురాలు అధికారికంగా రాజకీయ ప్రవేశం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా(47) జనవరి 23న తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో ఆమె తన సోదరుడు రాహుల్‌కు సహాయకారిగా పనిచేస్తారని వెల్లడించాయి. 1980 మధ్యనాళ్ల వరకు ఉత్తరప్రదేశ్‌ను తన కంచుకోటగా నిలుపుకున్న కాంగ్రెస్ క్రమంగా ప్రభ కోల్పోయింది. ప్రియాంక నియామకంతో అక్కడ పునర్‌వైభవం సంతరించుకుంటామని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. అలాగే జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్ గాంధీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ ప్రవేశం
ఎప్పుడు: జనవరి 23న
ఎవరు: ప్రియాంక గాంధీ వాద్రా
క్విక్ రివ్యూ :
ఏమిటి: ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ ప్రవేశం
ఎప్పుడు: జనవరి 23న
ఎవరు: ప్రియాంక గాంధీ వాద్రా
Published date : 24 Jan 2019 05:39PM