Skip to main content

ప్రతి పది మందిలో ఒకరికి కేన్సర్ : డబ్ల్యూహెచ్‌వో

భారతదేశంలో 2018లో దాదాపు 11.6 లక్షల కేన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.
Current Affairsప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవిత కాలంలో ప్రాణాంతక కేన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేన్సర్ బారిన పడిన వారిలో ప్రతి 15 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందని తెలిపింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్‌సీ) సంస్థలు ఫిబ్రవరి 4న రెండు నివేదికలు విడుదల చేశాయి. కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా ఎజెండా రూపొందించడంతో పాటు కేన్సర్‌పై పరిశోధన, నివారణలపై ఈ నివేదికలు ప్రధాన దృష్టి సారించాయి. సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో రాబోయే 20 ఏళ్లలో మధ్య ఆదాయ దేశాల్లో కేన్సర్ మరణాల రేటు 60 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

వరల్డ్ కేన్సర్ డే 2020 థీమ్ : ఐ యామ్ అండ్ ఐ విల్
Published date : 05 Feb 2020 05:42PM

Photo Stories