ప్రస్తుతం ఐసీఎంఆర్ డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
Sakshi Education
దేశ జనాభాలో 21.5 శాతం మంది కోవిడ్ ప్రభావానికి లోనయినట్లు మూడో సెరో సర్వేలో తేలింది.
ఈ మూడో సర్వేను 2020, డిసెంబర్ 17- 2021, జనవరి 8వ తేదీల మధ్య చేపట్టినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డెరైక్టర్ జనరల్ బలరాం భార్గవ్ ఫిబ్రవరి 4న తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 700 గ్రామాలు/వార్డుల్లో ఈ సర్వే నిర్వహించినట్లు వివరించారు. జనాభాలో అత్యధికులు ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
13 నుంచి రెండో డోస్...
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కోవిడ్-19 రెండో డోస్ వ్యాక్సినేషన్ మొదలవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇప్పటికే మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య కార్యకర్తలు 49,93,427 మందికి ఈ డోస్ అందుతుందన్నారు. ఈ డోస్ అందుకున్న కేవలం 0.18 శాతం మందిలో దుష్ప్రభావాలు కనిపించాయని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో 2021, జనవరి 16వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా ‘‘కోవిషీల్డ్’’, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ‘‘కోవాగ్జిన్’’ ఆరోగ్య కార్యకర్తలకు వేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశ జనాభాలో 21.5 శాతం మంది కోవిడ్ ప్రభావానికి లోనయ్యారు.
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : ఐసీఎంఆర్ డెరైక్టర్ జనరల్ బలరాం భార్గవ్

Published date : 06 Feb 2021 05:51PM