ప్రస్తుత దశాబ్దంలోనే అధిక ఉష్ణోగ్రతలు : ఐరాస
Sakshi Education
చరిత్రలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుత దశాబ్దం(2010-2019)లోనే నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఈ మేరకు డిసెంబర్ 3న జరిగిన ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో వాతావరణ మార్పులు మానవాళి సామర్థ్యాన్ని ఏవిధంగా అధిగమిస్తున్నాయో తెలిపింది.
2019లో అత్యధిక ఉష్ణోగ్రతలు
పారిశ్రామికీకరణ ముందు సమయం (1850-1900) లోని సగటు ఉష్ణోగ్రత కంటే 2019 ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సుమారు 1.1 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) వెల్లడించింది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2019 మొదటి 3 స్థానాల్లో నిలిచిందని పేర్కొంది. గత 12 నెలల్లో గ్రీన్‌ల్యాండ్ మంచు పలకల్లో సుమారు 329 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందని వివరించింది.

Published date : 04 Dec 2019 05:34PM