ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఎన్ని లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది?
Sakshi Education
2020-21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్-మార్చి) మధ్య రూ.4.34లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 30న వెల్లడించింది.
కరోనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, దీనితో ప్రభుత్వ ఆదాయాల అంచనాలకు గండి పడ్డం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఆర్థిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) మొత్తంలో రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. 2020, సెప్టెంబర్ వరకూ రూ.7.66 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరిగాయి.
వాస్తవానికి 7.80 లక్షల కోట్లే...
నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.80 లక్షల కోట్ల నికర మార్కెట్ రుణ సమీకరణలు జరపాలని 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. అయితే కరోనా ప్రభావంతో ఈ మొత్తాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం మే నెలలో నిర్ణయించింది. 2019-20లో కేంద్ర రుణ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు.
Published date : 02 Oct 2020 10:54AM