ప్రపంచవ్యాప్తంగా యోగా ఉత్సవాలు
Sakshi Education
5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రభాత్ తారా గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 40 వేల మందికి పైగా ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా అన్నిటికీ అతీతమైందని, దీనిని జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నగరాల నుంచి పల్లెలు, గిరిజన ప్రాంతాలకు యోగాను వ్యాపింపజేయాలన్నారు.
5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-విశేషాలు
5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-విశేషాలు
- 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ క్లైమెట్ ఛేంజ్’ అనే థీమ్‌తో ఐక్యరాజ్యసమితి నిర్వహించింది.
- ఐరాసలో ప్రపంచ నేతలు ప్రసంగించే విశ్వ వేదిక జనరల్ అసెంబ్లీ హాల్‌లో యోగా డే సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు, శిక్షకులు, గురువులు వివిధ ఆసనాలు వేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్‌లో ఈ తరహాలో యోగా ఉత్సవం జరపడం ఇదే ప్రథమం.
- ఐరాస ‘యోగా ఫర్ క్లైమెట్ ఛేంజ్’ అనే థీమ్‌తో పాటు హృదయం కోసం యోగా’ ఇతివృత్తంతో భారత్‌లో యోగా డే నిర్వహించారు.
- రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని యోగాసనాలు వేశారు.
- పార్లమెంట్ పరిసరాల్లో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు.
- ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోహ్‌తక్‌లో హోం మంత్రి అమిత్ షా, నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కారీ పాల్గొన్నారు.
- ప్రవాసీ భారతీయ కేంద్రంలో విదేశాంగ మంత్రి జై శంకర్ నేతృత్వంలో జరిగిన యోగాడే కార్యక్రమంలో 60 దేశాల రాయబారులు పాల్గొన్నారు.
- చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ యోగా డే పాటించారు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 22 Jun 2019 05:39PM