ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 కంపెనీల్లో రిలయన్స్
Sakshi Education
భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తాజాగా మరోసారి ప్రపంచంలోనే అగ్రశ్రేణి 100 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది.
2020 సంవత్సరానికి గాను ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకి 96వ స్థానానికి చేరింది. ఫార్చూన్ గ్లోబల్ 500లో ఇప్పటివరకు ఒక భారతీయ సంస్థ దక్కించుకున్న అత్యధిక ర్యాంకు ఇదే. 2012లో రిలయన్స్ తొలిసారిగా 99వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, 2016లో 215 ర్యాంకుకు తగ్గింది. ఆ తర్వాత నుంచి మళ్లీ క్రమంగా మెరుగుపడి, టాప్ 100లో చోటు దక్కించుకుంది.
151వ స్థానంలో ఐవోసీ...
ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో... ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 34 ర్యాంకులు తగ్గి 151వ స్థానంలో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎ¯ŒSజీసీ) 30 ర్యాంకులు తగ్గి 190వ స్థానంలో నిల్చాయి. ఎస్‌బీఐ 15 ర్యాంకులు మెరుగుపడి 221వ స్థానంలో ఉంది. భారత్ పెట్రోలియం (309), టాటా మోటార్స్ (337), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (462) కూడా లిస్టులో ఉన్నాయి.
అగ్రస్థానంలో వాల్‌మార్ట్..
ఫార్చూన్ 2020 లిస్టులో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వాల్‌మార్ట్ ఆదాయం 524 బిలియన్ డాలర్లు. ఇక చైనాకు చెందిన సైనోపెక్ గ్రూప్, స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఆదాయాల ప్రాతిపదిక...
2020 మార్చి ఆఖరు లేదా అంతకు ముందు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయాల ప్రాతిపదికన కంపెనీల ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్లు ఫార్చూన్ తెలిపింది. రిలయన్స్ ఆదాయం 86.2 బిలియన్ డాలర్లు కాగా, ఐవోసీ 69.2 బిలియన్ డాలర్లు, ఓఎన్జీసీ 57 బిలియన్ డాలర్లు, ఎస్‌బీఐ 51 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 కంపెనీల్లో రిలయన్స్
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితా

Published date : 12 Aug 2020 05:40PM