Skip to main content

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని ఎక్కడ నిర్మిస్తున్నారు?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్‌ లింక్‌ ప్రాజెక్టు(యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టు)లో భాగంగా చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్నారు.
Current Affairs
ఈ వంతెనకి సంబంధించిన ఆర్చ్‌ నిర్మాణం ఏప్రిల్‌ 5న పూర్తయిందని భారతీయ రైల్వే ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని తెలిపింది. కశ్మీర్‌ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్‌ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా పీయూష్‌ గోయల్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా అశుతోష్‌ అగర్వాల్‌ ఉన్నారు.

వంతెన ప్రత్యేకతలు
  • కశ్మీర్‌ లోయను మిగతా దేశంతో కలపడానికి వీలుగా రైల్వేశాఖ రూ.27,949 కోట్లతో ఉధంపుర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్వే ప్రాజెక్టు చేపడుతోంది. అందులో భాగంగా రూ.1,486 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మిస్తోంది.
  • వంతెన పొడవు: 1.315 కిలోమీటర్లు.
  • పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కన్నా ఈ బ్రిడ్జ్‌ 35 మీటర్ల ఎత్తులో ఉంది.
  • చీనాబ్‌ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది.
  • 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి.
  • 2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్‌ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్‌ టన్నులు.
  • 28660 మెట్రిక్‌ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు.
  • 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా వంతెనను డిజైన్‌ చేశారు.
  • నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్‌ చేశారు.
  • నిర్మాణంలో వినియోగించిన స్టీల్‌ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు.
  • అర్ధచంద్రాకారంలో ఉండే ఈ ఉక్కు వంతెన నిర్మాణం.. భారతీయ రైల్వే ఎదుర్కొన్న అతిపెద్ద సివిల్‌ ఇంజినీరింగ్‌ సవాల్‌.
  • వంతెనలో ప్రధానమైన ఆర్చి 467 మీటర్లు ఉంటుంది. దానిపైన వంతెన పొడవు 1,315 మీటర్లు ఉంటుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 5
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : చీనాబ్‌ నది, జమ్మూకశ్మీర్‌
ఎందుకు : కశ్మీర్‌ లోయను మిగతా దేశంతో కలపడానికి వీలుగా
Published date : 06 Apr 2021 06:19PM

Photo Stories