ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ కట్టడాలు/ప్రదేశాలు ఉన్న దేశం?
Sakshi Education
2021లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కొన్ని కట్టడాలను, ప్రదేశాలను గుర్తించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక వారసత్వ కట్టడాలు/ప్రదేశాలు ఉన్న దేశం?
ఎప్పుడు : ఆగస్టు 1, 2021
ఎవరు : ఇటలీ
ఎక్కడ : ప్రపంచంలోనే...
ఎందుకు : 2021 ఏడాదిలో మరికొన్ని కట్టడాలు/ప్రదేశాలకు యునెస్కో వారసత్వ హోదా లభించడంతో...
అందులో మన రామప్ప, గుజరాత్‌లోని దోలవీర ఉన్న సంగతి తెలిసిందే. తాజా జాబితాతో ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ కట్టడాలు/ప్రదేశాలు ఉన్న దేశంగా(2021 ఆగస్టు, 1వ తేదీ నాటికి) ఇటలీ నిలిచింది. గతేడాది వరకూ చైనా, ఇటలీలు చెరో 55 స్థానాలతో సమానంగా ఉండేవి. తాజా జాబితాలో అది మారిపోయింది. ఈ జాబితాలో 40 వారసత్వ కట్టడాలు/ప్రదేశాలతో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
అత్యధిక ప్రపంచ వారసత్వ కట్టడాలు కలిగిన దేశాలు(2021 ఆగస్టు 1వ తేదీ నాటికి)
అత్యధిక ప్రపంచ వారసత్వ కట్టడాలు కలిగిన దేశాలు(2021 ఆగస్టు 1వ తేదీ నాటికి)
ర్యాంకు దేశం | వారసత్వ కట్టడాలు/ప్రదేశాల | సంఖ్య |
1 | ఇటలీ | 58 |
2 | చైనా | 56 |
3 | జర్మనీ | 51 |
4 | స్పెయిన్ | 49 |
5 | ఫ్రాన్స్ | 49 |
6 | భారత్ | 49 |
7 | మెక్సికో | 35 |
8 | యూకే | 33 |
9 | రష్యా | 30 |
10 | ఇరాన్ | 26 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక వారసత్వ కట్టడాలు/ప్రదేశాలు ఉన్న దేశం?
ఎప్పుడు : ఆగస్టు 1, 2021
ఎవరు : ఇటలీ
ఎక్కడ : ప్రపంచంలోనే...
ఎందుకు : 2021 ఏడాదిలో మరికొన్ని కట్టడాలు/ప్రదేశాలకు యునెస్కో వారసత్వ హోదా లభించడంతో...
Published date : 04 Aug 2021 05:49PM