Skip to main content

ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్ పేరు?

సౌదీ అరేబియాకి చెందిన ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి అనే మహిళా కళాకారిణి 4.5 కిలోల పనికిరాని కాఫీ పొడితో సౌదీ అరేబియా స్థాపకులైన కింగ్ అబ్దుల్ అజీజ్, షేక్ జైద్‌ల చిత్రాలను గీశారు.
Current Affairs
సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఏడు వస్త్రాల కాన్వాస్‌పై 220 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పెయింటింగ్‌ను వేశారు. ‘నసీజ్1’గా పిలుస్తున్న ఈ పెయింటింగ్‌ను గిన్నిస్ ప్రపంచ రికార్డు వరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌గా నసీజ్1 నిలిచింది.

తొలి సౌదీ అరేబియా మహిళ...
నసీజ్1 విషయమై గిన్నిస్ రికార్డ్స్ సంస్థ స్పందిస్తూ... గతంలో ఒకరి కంటే ఎక్కువ మంది సౌదీ మహిళలు కలిసి ఇలాంటి పెయింటింగ్‌‌స వేసినట్టు తెలిపింది. 2015లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి రియాద్‌లో 8,264 మంది మహిళలు కలిసి అతిపెద్ద హ్యూమన్ ఎవేర్నెస్ రిబ్బన్‌ను రూపొందించారని పేర్కొంది. కానీ ఒక సౌదీ మహిళ ఒంటరిగా గిన్నిస్ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా నుంచి గిన్నిస్ జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి రికార్డు సాధించింది. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అక్టోబర్ 18న ప్రకటించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్ రూపకల్పన
ఎప్పుడు : 18
ఎవరు : ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి
ఎక్కడ : జెడ్డా, సౌదీ అరెబియా
Published date : 20 Oct 2020 05:42PM

Photo Stories