ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన
Sakshi Education
జమ్మూకశ్మీర్‌లోచీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు 2021 ఏడాదికి పూర్తికానున్నాయి.
కశ్మీర్‌నుమిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్‌లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు.
వంతెన విశేషాలు...
- 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన.
- గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా వంతెన డిజైన్ చేశారు.
- ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్–క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
- ప్రస్తుతం 111 కిలోమీటర్ల పొడవైన కాట్రా–బనిహాల్ సెక్షన్ లో పనులు కొనసాగుతున్నాయి.
- 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ :చీనాబ్ నది, జమ్మూకశ్మీర్
Published date : 04 Aug 2020 11:53AM