Skip to main content

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ విడుదల

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్‌–5’ను రష్యా అందుబాటులోకి తెచ్చింది.
Current Affairs
కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్ ను తయారు చేసిన తొలిదేశంగా రష్యా రికార్డు సృష్టించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ఆగస్టు 11న ప్రకటించారు. ఈ టీకా అద్భుతంగా పనిచేస్తుందని స్థిరమైన రోగ నిరోధక స్పందనను కలగజేస్తుందని స్పష్టం చేసిన పుతిన్ ఇప్పటికే తన కుమార్తెల్లో ఒకరికి ఈ టీకా ఇచ్చినట్లు తెలిపారు. స్పుత్నిక్‌–5 టీకాను అభివృద్ధి చేసిన గమలేయా రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌తోపాటు బిన్నోఫార్మ్‌ అనే కంపెనీలో వాణిజ్య ఉత్పత్తి జరుగుతుందని, చాలా దేశాలు టీకా సరఫరా కోసం సంప్రదిస్తున్నాయని రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో వివరించారు.

ప్రయోగ దశలపై అనుమానాలు
రష్యాలోని గమలేయా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రెండు టీకాలను అభివృద్ధి చేసింది. ఈ రెండూ మానవ ప్రయోగాలన్నీ పూర్తి చేసుకున్నాయని రష్యా చెబుతుండగా.. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం వీటిని తొలిదశలో ఉన్న టీకాలుగా మాత్రమే చూపుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ వెబ్‌సైట్‌లో కోవిడ్‌–19 టీకా ప్రయోగాలపై ఉన్న సమాచారం ప్రకారం చైనాకు చెందిన సైనోవాక్, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ/ఆస్ట్రాజెనెకాల టీకాలు మాత్రమే మూడో దశ మానవ ప్రయోగాల దశకు చేరుకున్నాయి. టీకా విడుదలకు తమకు సమయం పడుతుందని ఈ సంస్థలు చెబుతున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్‌–5’ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : రష్యా
Published date : 12 Aug 2020 05:32PM

Photo Stories