Skip to main content

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ?

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ కంపెనీ నిలిచింది. హురూన్ సంస్థ జనవరి 12న విడుదల చేసిన ‘‘ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీలు’’ జాబితాలో ఈ విషయం వెల్లడైంది.
Current Affairs

ఈ జాబితాలో యాపిల్ కంపెనీ 2.1 లక్షల కోట్ల డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉంది. 1.6 లక్షల కోట్ల డాలర్ల సంపదలతో మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లు యాపిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2020 ఏడాదిలో కంపెనీల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

జాబితాలోని ముఖ్యాంశాలు

  • 500 కంపెనీల జాబితాలో దాదాపు సగం కంపెనీలు(242) అమెరికావే ఉన్నాయి. చైనా కంపెనీలు 51 ఉండగా, జపాన్‌కు చెందిన 30 కంపెనీలు ఉన్నాయి.
  • భారతదేశానికి చెందిన 11 కంపెనీలు జాబితాలో ఉన్నాయి.
  • దేశాల పరంగా చూస్తే, ఈ జాబితాలో మన దేశం పదవ స్థానంలో నిలిచింది.
  • మొత్తం 500 కంపెనీల విలువ 50 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది ప్రపంచంలోని ఆరు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సంయుక్త జీడీపీకి సమానం.
  • ఈ కంపెనీలు 4.3 కోట్ల మందికి ఉపాధినిస్తున్నాయి. జర్మనీ జనాభాతో ఇది సమానం.
  • ఈ కంపెనీల విక్రయాలు(18 లక్షల కోట్ల డాలర్లు) చైనా జీడీపీ కంటే ఎక్కువ.


జాబితాలో మరిన్ని ముఖ్యాంశాలు...

  • జాబితాలో చోటు దక్కించుకున్న 11 భారత కంపెనీల విలువ 14 శాతం 3పెరిగి 80,500 కోట్ల డాలర్లకు చేరింది. ఇది మన దేశ జీడీపీలో దాదాపు మూడో వంతుకు సమానం.
  • 11 కంపెనీల్లో ఏడు కంపెనీల ప్రధాన కేంద్ర కార్యాలయాలు ముంబైలోనే ఉన్నాయి. మిగిలిన కంపెనీల కేంద్ర కార్యాలయాలు బెంగళూరు, పుణే, కోల్‌కత, న్యూఢిల్లీలలో ఉన్నాయి.
  • టాప్ 500 కంపెనీలలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 54వ స్థానం(భారత్‌లో తొలి స్థానం)లో నిలిచింది. ఈ కంపెనీ విలువ 21 శాతం ఎగసి 16,880 కోట్ల డాలర్లకు పెరిగింది.
  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విలువ 30 శాతం వృద్ధితో 13,900 కోట్ల డాలర్లకు పెరిగింది. దేశీయంగా రెండో స్థానంలో, అంతర్జాతీయంగా 73వ స్థానంలో ఈ కంపెనీ నిలిచింది.

జాబితాలో భారత కంపెనీలు

ప్రపంచ ర్యాంకు

కంపెనీ

విలువ(బిలియన్ డాలర్లలో)

54

రిలయన్స్ ఇండస్ట్రీస్

168.8

73

టీసీఎస్

139.0

105

హెచ్‌డీఎఫ్‌సీ

107.5

190

హిందుస్తాన్ యూనిలీవర్

68.2

201

ఇన్ఫోసిస్

66.0

249

హెచ్‌డీఎఫ్‌సీ

56.4

284

కోటక్ మహీంద్రా బ్యాంక్

50.6

316

ఐసీఐసీఐ బ్యాంక్

45.6

440

భారతీ ఎయిర్‌టెల్

35.6

451

బజాజ్ ఫైనాన్స్

35.0

480

ఐటీసీ

32.6

Published date : 13 Jan 2021 06:19PM

Photo Stories