Skip to main content

ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది.
Current Affairsఈమేరకు టామ్‌టామ్ (టామ్2) అనే సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరిట ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో సగటున 71 శాతం ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపింది. బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 10 రోజుల 3 గంటల పాటు (243 గంటలు) ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు పేర్కొంది. టాప్-10 జాబితాలో  ముంబై, పుణే, ఢిల్లీ నగరాలు వరుసగా 4, 5, 8 స్థానాల్లో నిలిచాయి. ట్రాఫిక్ రద్దీ ముంబైలో 65 శాతంగా, పుణేలో 59 శాతంగా, ఢిల్లీలో 56 శాతంగా ఉంది. టాప్-10లో మనీలా (ఫిలిప్పీన్‌‌స), బొగోటా (కొలంబియా), మాస్కో (రష్యా), లిమా (పెరు), ఇస్తాంబుల్ (టర్కీ), జకార్తా ( ఇండోనేసియా) ఉన్నాయి.
 
 క్విక్ రివ్యూ:
 ఏమిటి: {పపంచంలో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు
 ఎక్కడ: బెంగళూరు
 ఎందుకు: {పపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ నగరం
Published date : 30 Jan 2020 05:41PM

Photo Stories