ప్రపంచంలో అతిపెద్ద హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చుతున్న ప్రాజెక్టు?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే క్రస్ట్ గేట్ల నిర్వహణలో అత్యంత కీలకమైన 96 ‘హైడ్రాలిక్ హాయిస్ట్’ సిలిండర్లను జర్మనీలోని మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది.
ఇప్పటికే 70 సిలిండర్లు జర్మనీ నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేర్చారు. ప్రపంచంలో హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లతో అతిపెద్ద గేట్లను అమర్చుతున్న ప్రాజెక్టు పోలవరమే. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
Published date : 04 Feb 2021 06:02PM