Skip to main content

ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీకి జ్యోతి సురేఖ

ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ జాతీయ సెలెక్షన్ ట్రయల్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసి ఆర్చరీ ప్రపంచకప్‌కు ఎంపికైంది.
Current Affairs2020, మే 11 నుంచి 17 వరకు టర్కీలోని అంటాల్యాలో జరిగే రెండో ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ కాంపౌండ్ విభాగంలో భారత్ తరఫున బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం హరియాణాలో మార్చి 2న ముగిసిన సెలక్షన్ ట్రయల్స్‌లో సురేఖ రెండు కొత్త జాతీయ రికార్డులు నమోదు చేయడంతోపాటు టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
 
 సెలెక్షన్ ట్రయల్స్‌లో 12/12 పారుుంట్లతో సురేఖ నంబర్‌వనగా నిలిచింది. అనంతరం 709/720 స్కోరుతో తన పేరిటే ఉన్న రికార్డును (707/720)ను తిరగరాసింది. డబుల్ ఫిఫ్టీ రౌండ్‌లో 1411/1440 స్కోరుతో తన రికార్డు (1405/1440)ను తానే బద్దలు కొట్టింది. ప్రపంచ రికార్డు (1412)కు చేరువగా వచ్చింది.

క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
అంటాల్యాఆర్చరీ ప్రపంచకప్‌కు ఎంపిక
 ఎప్పుడు  : మార్చి 2
 ఎవరు  : వెన్నం జ్యోతి సురేఖ
 ఎక్కడ  : అంటాల్యా, టర్కీ
Published date : 03 Mar 2020 06:00PM

Photo Stories