Skip to main content

ప్రపంచాభివృద్ధిలో భారత్ వాటా 15 శాతం: యూబీఎస్

2025-26 నాటికి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భారత్ 15 శాతం వాటా పొందుతుందని చైనా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అండ్ బ్రోకరేజ్ దిగ్గజ సంస్థ- యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.
Current Affairs

ఈ మేరకు జనవరి 19న ఒక నివేదికను విడుదల చేసింది. అయితే ప్రపంచాభివృద్ధిలో భారత్ కలిగి ఉన్న ప్రస్తుత వాటా విషయం మాత్రం నివేదిక ప్రస్తావించలేదు.

నివేదికలోని ముఖ్యాంశాలు...

  • తోటి వర్థమాన దేశాలతో పోల్చితే, ‘తయారీ’ వ్యయాల విషయంలో భారత్ తక్కువగా ఉంది.
  • గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటా ప్రస్తుతం దాదాపు జీరో. అయితే వచ్చే రెండేళ్లలో ఇది 20 నుంచి 30 శాతానికి చేరే అవకాశం ఉంది.
  • 2021-22లో భారత్ ఆర్థికాభివృద్ధి 11.5 శాతంగా ఉంటుంది.
  • 2019-20లో భారత్ ఆల్ టైమ్ హైలో 56 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆకర్షించింది.
  • కరోనా ప్రేరిత అంశాల వల్ల 2020-21లో భారత్ ఆకర్షించిన ఎఫ్‌డీఐలు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
  • 2025-26 నాటికి ఈ ఎఫ్‌డీఐల పరిమాణం 100 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది.
Published date : 22 Jan 2021 04:26PM

Photo Stories