ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల కరోనా కేసులు
Sakshi Education
చైనాలో తొలి కరోనా కేసు వెలుగు చూసి ఆరు నెలలైంది.
భారత్‌లో..
భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసులు 1,06,750కి, మొత్తం మరణాలు 3,303కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 61,149. ఈ వైరస్ బారినపడిన వారిలో 42,298 మంది చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 39.62 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అమెరికాకి తగ్గని కోవిడ్ దడ
కోవిడ్–19తో అమెరికా ఇంకా వణుకుతూనే ఉంది. 15 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 93 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. న్యూయార్క్, న్యూజెర్సీలు శవాలదిబ్బలుగా మారితే ఇప్పుడు అమెరికాలో మారుమూల ప్రాంతాలకూ వైరస్ విస్తరిస్తోంది.
రష్యాలో విజృంభణ
ప్రపంచ దేశాల్లో కోవిడ్–19 కేసుల్లో రష్యా రెండోస్థానానికి చేరుకుంది. కేసులు 3 లక్షలు దాటేశాయి. 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య మాత్రం తక్కువగా ఉండడం ఊరటనిస్తోంది. వైరస్ సోకిన వారిలో ఒక్కశాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారు.
యూకేలో ఎల్ టైప్ వైరస్
యూరప్‌లో కోవిడ్–19 వణికిస్తున్న దేశాల్లో యూకే ప్రధానమైనది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాపై పోరాటం చేసి కోలుకున్నప్పటికీ ఆ దేశంలో కేసుల్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు. 2 లక్షల 50 వేలకు పైగా కేసులు నమోదైతే, 35 వేల మంది కంటే ఎక్కువే మృతి చెందారు. బ్రిటన్‌లో లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతున్నా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. మొదట్లో ఎస్ టైప్ వైరస్ స్ట్రెయిన్స్ వస్తే, ఇప్పుడు ఎల్ టైప్ స్ట్రెయిన్స్ కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. ఈ ఎల్ తరహా వైరస్ కేసుల సంఖ్యని త్వరితగతిన పెంచేస్తోంది.
బ్రెజిల్ బెంబేలు
లాటిన్ అమెరికా దేశాల్లోని బ్రెజిల్‌లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీ, యూకేని దాటేసి నాలుగో స్థానంలోకి చేరుకుంది. కేసులు 2 లక్షల 70 వేలు దాటితే, 18 వేల మంది వరకు మరణించారు. దేశంలో ఆంక్షలు కూడా విధించకపోవడంతో కేసులు అంతకంతకూ పెరిగిపోయి ఆస్పత్రి సౌకర్యాలు లేక రోగులకు చికిత్స అందివ్వడమే కష్టంగా మారింది. దీంతో మృతుల రేటు 6 శాతం నమోదవుతోంది.

ఈ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య మే 20నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటింది. 3 లక్షల 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 213 దేశాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటివరకు ఏ వ్యాధి కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలను భయపెట్టలేదు. వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వస్తుందన్న ఆశ లేకపోవడంతో కరోనాతో కలిసి బతుకు బండిని సాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆర్థికం, ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించడం కోసమే దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోంది.
భారత్‌లో..
భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసులు 1,06,750కి, మొత్తం మరణాలు 3,303కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 61,149. ఈ వైరస్ బారినపడిన వారిలో 42,298 మంది చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 39.62 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అమెరికాకి తగ్గని కోవిడ్ దడ
కోవిడ్–19తో అమెరికా ఇంకా వణుకుతూనే ఉంది. 15 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 93 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. న్యూయార్క్, న్యూజెర్సీలు శవాలదిబ్బలుగా మారితే ఇప్పుడు అమెరికాలో మారుమూల ప్రాంతాలకూ వైరస్ విస్తరిస్తోంది.
రష్యాలో విజృంభణ
ప్రపంచ దేశాల్లో కోవిడ్–19 కేసుల్లో రష్యా రెండోస్థానానికి చేరుకుంది. కేసులు 3 లక్షలు దాటేశాయి. 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య మాత్రం తక్కువగా ఉండడం ఊరటనిస్తోంది. వైరస్ సోకిన వారిలో ఒక్కశాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారు.
యూకేలో ఎల్ టైప్ వైరస్
యూరప్‌లో కోవిడ్–19 వణికిస్తున్న దేశాల్లో యూకే ప్రధానమైనది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాపై పోరాటం చేసి కోలుకున్నప్పటికీ ఆ దేశంలో కేసుల్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు. 2 లక్షల 50 వేలకు పైగా కేసులు నమోదైతే, 35 వేల మంది కంటే ఎక్కువే మృతి చెందారు. బ్రిటన్‌లో లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతున్నా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. మొదట్లో ఎస్ టైప్ వైరస్ స్ట్రెయిన్స్ వస్తే, ఇప్పుడు ఎల్ టైప్ స్ట్రెయిన్స్ కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. ఈ ఎల్ తరహా వైరస్ కేసుల సంఖ్యని త్వరితగతిన పెంచేస్తోంది.
బ్రెజిల్ బెంబేలు
లాటిన్ అమెరికా దేశాల్లోని బ్రెజిల్‌లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీ, యూకేని దాటేసి నాలుగో స్థానంలోకి చేరుకుంది. కేసులు 2 లక్షల 70 వేలు దాటితే, 18 వేల మంది వరకు మరణించారు. దేశంలో ఆంక్షలు కూడా విధించకపోవడంతో కేసులు అంతకంతకూ పెరిగిపోయి ఆస్పత్రి సౌకర్యాలు లేక రోగులకు చికిత్స అందివ్వడమే కష్టంగా మారింది. దీంతో మృతుల రేటు 6 శాతం నమోదవుతోంది.
Published date : 21 May 2020 05:20PM