ప్రపంచ వుషులో ప్రవీణ్‌కు స్వర్ణం
Sakshi Education
15వ ప్రపంచ వుషు (మార్షల్ ఆర్ట్స్) చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలిచాడు.
చైనాలోని షాంఘైలో అక్టోబర్ 23న జరిగిన 48 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో ప్రవీణ్ 2-1తో దియాజ్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గాడు. మహిళల సాండా ఈవెంట్‌లో పూనమ్ (75 కేజీలు), సనతోయ్ దేవి (52 కేజీలు) రజతాలు... పురుషుల 60 కేజీల ఈవెంట్‌లో విక్రాంత్ కాంస్యం సాధించారు. వుషు అనేది చైనాకు చెందిన యుద్ధ కళ. దీన్ని కుంగ్ ఫూ అని కూడా స్థానికంగా పిలుస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 15వ ప్రపంచ వుషు చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : ప్రవీణ్ కుమార్
ఎక్కడ : షాంఘై, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 15వ ప్రపంచ వుషు చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : ప్రవీణ్ కుమార్
ఎక్కడ : షాంఘై, చైనా
Published date : 24 Oct 2019 05:36PM