ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఓఈసీడీ కోత
Sakshi Education
ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) కోత పెట్టింది.

2019 ఏడాది వృద్ధి రేటు 3.2 శాతమే ఉంటుందని ఓఈసీడీ పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 3.3 శాతంగా ఉంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, తమ వృద్ధి రేటు అంచనా తగ్గింపునకు ఇదే కారణమని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ విశ్లేషించింది. మౌలిక రంగం, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, నైపుణ్యత పెంపు వంటి అంశాల్లో పెట్టుబడులు పెరగాలనీ సూచించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019 ఏడాది ప్రపంచ వృద్ధి రేటు అంచనా 3.2 శాతానికి కోత
ఎప్పుడు : మే 21
ఎవరు : ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ)
ఎందుకు : అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వల్ల
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019 ఏడాది ప్రపంచ వృద్ధి రేటు అంచనా 3.2 శాతానికి కోత
ఎప్పుడు : మే 21
ఎవరు : ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ)
ఎందుకు : అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వల్ల
Published date : 22 May 2019 06:10PM