Skip to main content

ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి?

2021, ఆగస్టు 18 నుంచి 29 వరకు చైనాలోని చెంగ్డూ నగరంలో జరగాల్సిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలను 2022 ఏడాదికి వాయిదా వేశారు.
Current Affairsకరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్‌ 2న అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్రీడా సమాఖ్య (ఎఫ్‌ఐఎస్‌యూ) తెలిపింది. వచ్చే ఏడాది చైనాలో మరో రెండు మెగా ఈవెంట్స్‌ ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో బీజింగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌... 2022 సెప్టెంబర్‌లో హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరగాల్సి ఉన్నాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
2022 ఏడాదికి ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు–2021 వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు : అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్రీడా సమాఖ్య (ఎఫ్‌ఐఎస్‌యూ)
ఎక్కడ : చెంగ్డూ నగరం, చైనా
ఎందుకు : కరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో
Published date : 03 Apr 2021 05:30PM

Photo Stories