ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు 4వ స్థానం
Sakshi Education
ఆస్తానా (కజకిస్తాన్ ): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్‌లో భారత పురుషుల జట్టు అద్భుత పోరాటానికి అనుకున్న ఫలితం దక్కలేదు.
త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న భారత్ నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. మార్చి 14న రష్యాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్ 1.5-2.5తో ఓడిపోయింది. ఈ గేమ్‌ను 2-2తో డ్రా చేసుకున్నా.... కనీసం భారత్‌కు కాంస్య పతకం లభించి ఉండేది. సెర్గీ కర్జాకిన్ తో ఆధిబన్ , దిమిత్రి ఆండ్రెకిన్ తో అరవింద్ చితాంబరమ్, ఇయాన్ నెపొనియాచితో సూర్య గంగూలీ తమ గేమ్‌లను డ్రా చేసుకోగా... మూడో బోర్డుపై అలెగ్జాండర్ గ్రిస్చుక్ చేతిలో ఎస్పీ సేతురామన్ ఓడిపోయాడు. దీంతో భారత్ 11 పాయింట్ల తో నాలుగో స్థానంలో నిలిచింది. 16 పాయింట్లతో రష్యా స్వర్ణాన్ని కై వసం చేసుకోగా, 13 పాయింట్లతో ఇంగ్లండ్ రజతాన్ని, చైనా (12 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి. వ్యక్తిగత ప్రదర్శనలకుగాను ఆధిబన్ (6/9), సూర్య గంగూలీ (7/9) పసిడి పతకాలు గెలుచుకున్నారు. మహిళల విభాగంలో భారత్ 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. హంగేరీతో తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్‌లో భారత పురుషుల జట్టుకు 4వ స్థానం
ఎప్పుడు : మార్చి 14
ఎక్కడ : ఆస్తానా (కజకిస్తాన్)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్‌లో భారత పురుషుల జట్టుకు 4వ స్థానం
ఎప్పుడు : మార్చి 14
ఎక్కడ : ఆస్తానా (కజకిస్తాన్)
Published date : 15 Mar 2019 06:14PM