ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రైజ్‌మనీ ఎంత?
Sakshi Education
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఎవరో త్వరలోనే తేలనుంది. ఈ నేపథ్యంలో విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూన్ 14న వెల్లడించింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ‘ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 71 లక్షలు) బహుమతిగా అందజేస్తారు. రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.5 కోట్ల 85 లక్షలు) దక్కుతాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే పోరు ‘డ్రా’ లేదా ‘టై’ అయితే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఫైనల్ మొత్తం ప్రైజ్‌మనీని (24 లక్షల డాలర్లు) సమానంగా 12 లక్షల డాలర్ల చొప్పున (రూ. 8 కోట్ల 78 లక్షలు) పంచుతారు.
మూడో స్థానం పొందిన జట్టుకు 4 లక్షల 50 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 29 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 56 లక్షలు), ఐదో స్థానంలో నిలిచిన జట్టుకు 2 లక్షల డాలర్లు (రూ. కోటీ 46 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండేళ్లుగా 9 జట్లు డబ్ల్యూటీసీలో భాగమైన టెస్టు సిరీస్‌లు ఆడాయి. ఈ నేపథ్యంలో 6 నుంచి 9 స్థానాల్లో ఉన్న జట్లకు లక్ష డాలర్ల చొప్పున (రూ.73 లక్షలు) అందజేస్తారు.

Published date : 15 Jun 2021 08:26PM