ప్రపంచ స్మార్ట్ సిటీల్లో తొలి స్థానంలో నిలిచిన నగరం?
Sakshi Education
ఐఎండీ, ఎస్‌యూటీడీలు సర్వే చేసి రూపొందించిన ‘ప్రపంచ స్మార్ట్ సిటీ సూచీ-2020’లో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో 2019 ఏడాదితో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు దిగజారాయి. జాబితాలో హైదరాబాద్ 85, న్యూఢిల్లీ 86, ముంబై 93, బెంగళూరు 95వ స్థానాల్లో నిలిచాయి. 2019లో ఈ నగరాలు వరుసగా 67, 68, 78, 79 స్థానాలు దక్కించుకున్నాయి.
అంతర్జాతీయంగా చూస్తే...
అంతర్జాతీయంగా చూస్తే స్మార్ట్ సిటీల జాబితాలో సింగపూర్ తర్వాత హెల్సిన్కి, జ్యూరిచ్, ఆక్‌లాండ్, ఓస్లో, కోపెన్‌హాగెన్, జెనీవా, తైపీ, ఆమ్‌స్టర్‌డామ్, న్యూయార్క్‌లు ఉన్నాయి.
కరోనా ప్రభావం...
స్మార్ట్ సిటీల జాబితా రూపొందించడం కోసం ప్రతి నగరంలో వందలాదిమందిని సర్వే చేశారు. సర్వే కోసం 15 సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం, భద్రత, రవాణా, అవకాశాలు, పాలన తదితర అంశాల్లో సాంకేతికత వినియోగంపై సర్వేలో ఎక్కువ దృష్టి పెట్టారు. స్మార్ట్‌సిటీలపై కరోనా ప్రభావం తీసివేయలేనిదని, సాంకేతికత బాగా ఉన్న చోట్ల ప్రభావం తక్కువని ఐఎండీ ప్రొఫెసర్ అర్టురోబ్రిస్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ స్మార్ట్ సిటీల్లో సింగపూర్‌కు తొలి స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ఐఎండీ, ఎస్‌యూటీడీ
ఎక్కడ : ప్రపంచంలో

Published date : 19 Sep 2020 06:11PM