Skip to main content

ప్రపంచ స్మార్ట్ సిటీల్లో హైదరాబాద్‌కు 67వ స్థానం

ప్రపంచ స్మార్ట్ సిటీల(ఆకర్షణీయ నగరాలు)-100 జాబితాలో గ్రేటర్ హైదరాబాద్‌కు 67వ స్థానం లభించింది.
ఈ జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కగా వాటిల్లో హైదరాబాద్ ముందుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ 68వ స్థానం, ముంబై 78వ స్థానం దక్కించుకున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సంస్థలు 102 నగరాలపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ జాబితాను అక్టోబర్ 4న విడుదల చేశారు.

ప్రపంచ స్మార్ట్ సిటీల-100 జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా... రెండోస్థానంలో జూరిచ్, మూడోస్థానంలో ఓస్లో, నాలుగోస్థానంలో జెనీవా, ఐదో స్థానంలో కొపెన్‌హెగెన్ నగరాలు ఉన్నాయి.
Published date : 05 Oct 2019 05:39PM

Photo Stories