Skip to main content

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం

ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు.
ఈ మేరకు ‘ప్రపంచ బిలియనీర్ల జాబితా-2019’ను ఫోర్బ్స్ మ్యాగజైన్ మార్చి 5న విడుదల చేసింది. 2018లో 40.1 బిలియన్ డాలర్ల సంపదతో 19వ స్థానంలో ఉన్న ముకేశ్ 2019లో 50 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు లభించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు.

ప్రపంచ బిలియనీర్ల జాబితా-2019

స్థానం

పేరు

కంపెనీ

1

జెఫ్ బెజోస్

అమెజాన్

13

ముకేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్

36

అజిమ్ ప్రేమ్‌జీ

విప్రో

82

శివ్ నాడార్

హెచ్‌సీఎల్ కో-ఫౌండర్

91

లక్ష్మీ మిట్టల్

ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్

114

ఉదయ్ కోటక్

కోటక్ మహీంద్రా బ్యాంక్

122

కుమార మంగళం బిర్లా

ఆదిత్య బిర్లా గ్రూప్

167

గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్

244

సునీల్ మిట్టల్

భారతీ ఎయిర్‌టెల్

365

ఆచార్య బాల్‌కృష్ణ

పతంజలి ఆయుర్వేద

436

అజయ్ పిరమల్

పిరమల్ ఎంటర్‌ప్రెజైస్

617

కిరణ్ మజుందార్ షా

బయోకాన్

962

ఎన్.ఆర్. నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్

1349

అనిల్ అంబానీ

ఆర్‌కామ్

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ఫోర్బ్స్ మ్యాగజైన్
Published date : 06 Mar 2019 05:40PM

Photo Stories