ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణం
Sakshi Education
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది.
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఆగస్టు 31న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్-234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా -215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్ వర్మ స్వర్ణాలు అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణం
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎవరు: యశస్విని సింగ్
ఎక్కడ: బ్రెజిల్‌లోని రియో డి జనీరో
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణం
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎవరు: యశస్విని సింగ్
ఎక్కడ: బ్రెజిల్‌లోని రియో డి జనీరో
Published date : 03 Sep 2019 06:24PM