Skip to main content

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ రద్దు

2021 ఏడాదికి వారుుదా పడ్డ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2020 పూర్తిగా రద్దరుుంది.
Edu news కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అక్టోబర్ 22న ప్రకటించింది. మహమ్మారి వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇంకా తొలగకపోవడం... ఆటగాళ్ల ఆరోగ్య భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ తాము ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ థామస్ లుండ్ తెలిపారు.
 
 న్యూజిలాండ్ వేదికగా...
 వాస్తవానికి ఈ టోర్నీ న్యూజిలాండ్ వేదికగా 2020 ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో జరగాల్సి ఉండగా... కరోనా వల్ల 2021 ఏడాది జనవరికి వారుుదా పడింది. 2020 చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కోల్పోరుున న్యూజిలాండ్‌కు... 2024లో ఆ కోరిక తీరనుంది. ఈ మేరకు 2024 చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులను న్యూజిలాండ్‌కు ఇస్తూ బీడబ్ల్యూఎఫ్ నిర్ణయం తీసుకుంది. 2021 చాంపియన్‌షిప్ 2021, అక్టోబర్‌లో చైనా వేదికగా జరగాల్సి ఉంది.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2020 రద్దు
 ఎప్పుడు  : అక్టోబర్ 22
 ఎవరు  : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)
 ఎందుకు : కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇంకా తొలగకపోవడంతో
Published date : 23 Oct 2020 06:09PM

Photo Stories