Skip to main content

ప్రపంచ జీడీపీ3.3 శాతానికి తగ్గింపు : ఓఈసీడీ

2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్థిక సహకార- అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) 2018, నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఈ సందర్భంగా ఓఈసీడీ పేర్కొంది.
మరోవైపు జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా ఓఈసీడీ సవరించింది. 19 దేశాల యూరో జోన్ వృద్ధి అంచనాలను 1.8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. అలాగే జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7 శాతానికి సవరించగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్ 0.2 శాతానికి తగ్గించింది. బ్రిటన్ వృద్ధి అంచనాలను 1.4 శాతం నుంచి 0.8 శాతానికి సవరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019 ఏడాదికి ప్రపంచ జీడీపీ 3.3 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఆర్థిక సహకార- అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)
Published date : 07 Mar 2019 05:53PM

Photo Stories