ప్రపంచ బ్యాడ్మింటన్ జూనియర్ ర్యాంకింగ్‌స రెండో ర్యాంక్పొందిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు?
Sakshi Education
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి బాలికల సింగిల్స్ విభాగంలో రెండో ర్యాంక్‌కు ఎగబాకింది.
శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌సలో 17 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి సామియా ఆరు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. గతంలో ఆసియా అండర్-15 చాంపియన్‌గా నిలిచిన సామియా ఖాతాలో మొత్తం 11,360 ర్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. సామియాతోపాటు భారత్‌కే చెందిన తస్నీమ్ మీర్ (4వ ర్యాంక్), త్రిష జాలీ (8వ ర్యాంక్), అదితి భట్ (10వ ర్యాంక్) టాప్-10లో నిలిచారు. బాలుర సింగిల్స్ విభాగంలో వరుణ్ కపూర్ నాలుగు స్థానాలు పురోగతి సాధించి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Published date : 16 Jan 2021 03:32PM