Skip to main content

ప్రపంచ బాల మేధావిగా ఈశ్వర్ శర్మ

ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్ విద్యార్థి, బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మను ప్రపంచ బాల మేధావి-2020 అవార్డుతో బ్రిటన్ సత్కరించింది.
Current Affairs30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్‌నెస్, మార్షల్ ఆర్ట్స్ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.’అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ బాల మేధావి-2020 అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మ
ఎందుకు : ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ

మాదిరి ప్రశ్నలు
Published date : 13 Jan 2020 06:00PM

Photo Stories