ప్రపంచ బాక్సింగ్‌లో అమిత్‌కు రజతం
Sakshi Education
ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారతీయ బాక్సర్ అమిత్ పంఘాల్ రజత పతకం గెలిచాడు.
దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా అమిత్ రికార్డు నెలకొల్పాడు. రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో సెప్టెంబర్ 21న జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్లో షఖోబిదిన్ జొయిరొవ్ (ఉజ్బెకిస్తాన్) 30-27, 30-27, 29-28, 29-28, 29-28 (5-0) స్కోరుతో అమిత్‌ను ఓడించాడు. దీంతో జొయిరొవ్‌కు స్వర్ణం, అమిత్‌కు రజతం లభించింది. మరో భారత బాక్సర్ మనీశ్ కౌశిక్ (63 కేజీలు)కు కాంస్య పతకం దక్కింది. ఫలితంగా ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత్‌కు 2 పతకాలు లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : అమిత్ పంఘాల్
ఎక్కడ : ఎకటెరిన్‌బర్గ్, రష్యా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : అమిత్ పంఘాల్
ఎక్కడ : ఎకటెరిన్‌బర్గ్, రష్యా
Published date : 23 Sep 2019 05:36PM