ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4.2 శాతం క్షీణత: ఓఈసీడీ
Sakshi Education
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020 ఏడాదిలో 4.2 శాతం క్షీణిస్తుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) అంచనా వేసింది. ఈ మేరకు డిసెంబర్ 1న ఒక నివేదికను విడుదల చేసింది.
2021 నుంచీ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని తన నివేదికలో పేర్కొంది. అయితే అన్ని దేశాల్లో రికవరీ ఒకే తీరున ఉండే అవకాశం లేదని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడ్డానికి ప్రపంచదేశాల పరస్పర సహకారం కీలకమని వెల్లడించింది. ఓఈసీడీలో 37 దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఓఈసీడీ చీఫ్ ఎకనమిస్ట్‌గా లారెన్స్ బూన్ ఉన్నారు.
Published date : 02 Dec 2020 06:11PM