ప్రపంచ ఆకలి సూచీ(గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారత్ ర్యాంకు?
Sakshi Education
2020 సంవత్సరానికి గాను రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్‌ఐ)లో 107 దేశాలకు గాను భారత్ 94వ స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఆకలి సూచీలో 94వ స్థానంలో నిలిచిన దేశం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : భారత్
అక్టోబర్ 17న విడుదలైన ఈ సూచీని పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు.
ప్రపంచ ఆకలి సూచీ-2020లోని ముఖ్యాంశాలు
- ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌లు ఉన్నాయి.
- చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్ ర్యాంకింగ్‌లు సాధించాయి.
- భారత్ (94 ర్యాంకు), బంగ్లాదేశ్ (75), మయన్మార్ (78), పాకిస్తాన్ (88) స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది.
- నేపాల్ 73, శ్రీలంక 64 ర్యాంకుల్ని సాధించి ఆకలి సమస్య మధ్యస్తంగా ఉన్న దేశాల జాబితాలో చేరాయి.
- 2019 ఏడాది 117 దేశాలకు భారత్ 102వ స్థానంలో ఉంటే ఈసారి మెరుగుపడింది.
- భారత్‌లో 14శాతం జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
- అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 37.4 శాతం మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి.
- అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 17.3 శాతం మంది ఎత్తుకి తగ్గ బరువు లేరు.
- అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 3.7 శాతం మంది మృత్యువాత పడుతున్నారు.
భారత్‌లో ఆకలి కేకలకు కారణాలివీ..
- అందరికీ ఆహారం పంపిణీ విధానంలో లోపాలు
- ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యపూరిత వైఖరితో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం
- పౌష్టికాహార లోపాలు అరికట్టడానికి సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం
- ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి అతి పెద్ద రాష్ట్రాలు పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం
- నిరక్షరాస్యులే తల్లులుగా మారడం, వారిలో రక్తహీనత లోపాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఆకలి సూచీలో 94వ స్థానంలో నిలిచిన దేశం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : భారత్
Published date : 19 Oct 2020 05:44PM