ప్రొ వాలీబాల్ లీగ్ తొలి సీజన్ ప్రారంభం
Sakshi Education
తొలిసారి నిర్వహిస్తున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ప్రారంభమైంది.
కేరళలో కొచ్చిలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2న జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కొచ్చి జట్టు 4-1 సెట్లతో యూ ముంబా వాలీ జట్టుపై జయభేరి మోగించింది. రూపే స్పాన్సర్‌షిప్ చేస్తోన్న పీవీఎల్ తొలి సీజన్‌లో ఆరు ఫ్రాంచైజీ జట్లు రెండు వేదికలు కొచ్చి, చెన్నైలో తలపడతాయి. మొదట 12 లీగ్ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయి. మరో ఆరు మ్యాచ్‌లు, సెమీఫైనల్స్, ఫైనల్ పోటీలు చెన్నైలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22న టైటిల్ పోరు జరగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రొ వాలీబాల్ లీగ్ తొలి సీజన్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎక్కడ : రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియం, కొచ్చి, కేరళ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రొ వాలీబాల్ లీగ్ తొలి సీజన్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎక్కడ : రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియం, కొచ్చి, కేరళ
Published date : 04 Feb 2019 06:28PM