Skip to main content

ప్రొ కబడ్డీ లీగ్ విజేతగా బెంగాల్ వారియర్స్

ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-7 విజేతగా బెంగాల్ వారియర్స్ నిలిచింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ద ఎరీనా ఇండోరో స్టేడియంలో అక్టోబర్ 19న జరిగిన జరిగిన ఫైనల్లో వారియర్స్ 39-34తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. దీంతో బెంగాల్ వారియర్స్ తొలిసారి పీకేల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నట్లయింది. బెంగాల్ జట్టుకు మణిందర్ సింగ్ నేతృత్వం వహించగా... ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా జోగేందర్ నర్వాల్ వ్యవహరించాడు. విజేత బెంగాల్ వారియర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. పీకేఎల్ సీజన్-7కు వివో స్పాన్సర్‌షిప్‌గా వ్యవ హరించింది.

పీకేఎల్ సీజన్ 7-విశేషాలు
  • అత్యధిక రైడ్ పాయింట్లు- పవన్ సెరావత్ (346- బెంగళూరు బుల్స్)
  • అత్యధిక ట్యాక్లింగ్ పాయింట్లు- ఫజల్ అత్రచలి (82- యు ముంబా)
  • బెస్ట్ ఆల్‌రౌండర్-పవన్ సెరావత్
  • సూపర్ రైడ్లు- పర్దీప్ నర్వాల్ (15- పట్నా పైరేట్స్)
  • సూపర్ 10- నవీన్ కుమార్ (22- దబంగ్ ఢిల్లీ)
  • సూపర్ ట్యాకిళ్లు- విశాల్ భరద్వాజ్ (9- తెలుగు టైటాన్స్)
  • హై5- సుర్జీత్ సింగ్ (7- పుణెరి పల్టాన్)

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-7 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : బెంగాల్ వారియర్స్
ఎక్కడ : ద ఎరీనా ఇండోరో స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్
Published date : 21 Oct 2019 05:16PM

Photo Stories